: ఎలాంటి ప్రత్యేకతలు లేని ఈ రిస్ట్ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

విలువైన వజ్రాలు, రంగురాళ్లు పొదిగి తయారు చేసే రిస్ట్ వాచ్ ల విలువ కోట్ల రూపాయలు ఉండటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ, ఎటువంటి హంగులు, ప్రత్యేకతలు లేని ఒక రిస్ట్ వాచ్ ధర రూ. కోట్లలో పలుకుతోంది. ఆ రిస్ట్ వాచ్ ను స్విట్జర్లాండ్ కు చెందిన గ్రూబెల్ ఫోర్సీ క్వాడ్రపుల్ టర్బలిన్ అనే కంపెనీ ఒక రిస్ట్ వాచ్ ను తయారుచేసింది. దారి ఖరీదు 8.15 లక్షల డాలర్లు. మన రూపాయలలో అయితే రూ. 5.34 కోట్లు. విలువైన వజ్రాలు, రంగురాళ్లతో ఈ వాచ్ ను తయారు చేయనప్పటికీ దీని ఖరీదు ఒక రేంజ్ లో ఉండటానికి కారణం ... నాలుగు టర్బలీన్ కేజ్ లను అమర్చి ఈ వాచ్ ను తయారు చేశారు. తద్వారా గ్రావిటీ ఎక్కువై కచ్చితమైన సమయాన్ని వాచ్ చూపిస్తుంది. మరో గమ్మత్తయిన విషయం ఏమిటో తెలుసా.. ప్రతి ఏటా ఈ సంస్థ కేవలం నాలుగు లేదా ఆరు రిస్ట్ వాచ్ లను మాత్రమే తయారు చేస్తుంది!

More Telugu News