: ఏడుగురు తమిళ జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక

తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం మరోసారి అరెస్ట్ చేసింది. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఏడుగురు జాలర్లను అదుపులోకి తీసుకుంది. వీరందరినీ జాఫ్నాకు సమీపంలోని కాంకేసంతురాయ్ వద్దకు తరలించి, విచారిస్తున్నారు. తాము కఠిన నిబంధనలను విధిస్తున్నా, లెక్కచేయకుండా తమిళ జాలర్లు తమ జలాల్లోకి ప్రవేశిస్తున్నారని శ్రీలంక అంటోంది. తాజా అరెస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News