: కన్నీటి సంద్రం విశాఖ తీరం... అశ్రునయనాల మధ్య అదితికి వీడ్కోలు

అదితి...విశాఖకు చెందిన ఆరేళ్ల ఆ చిన్నారి బాలిక ట్యూషన్ కు వెళ్లి ఇంటికి వస్తూ నాలాలో పడిపోయింది. ఈ నెల 24న ఈ ఘటన జరిగిన తర్వాత నిన్నటిదాకా పాప ఆచూకీ కూడా లభించలేదు. బాలిక తల్లిండ్రులతో పాటు విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది, భారత నావికాదళం తీవ్రంగా గాలింపు జరపగా నిన్న నిర్జీవంగా పడి ఉన్న స్థితిలో ఆ బాలిక కనిపించింది. దీంతో ఆరు రోజులగా, బాలిక తల్లిదండ్రులు తమ చిన్నారి సజీవంగా తిరిగొస్తుందని ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. నేటి ఉదయం నగరంలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ తర్వాత జరిగిన బాలిక అంత్యక్రియలకు విశాఖ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో విశాఖ తీరం కన్నీటి సంద్రంగా మారింది. కొద్దిసేపటి క్రితం బాలిక అంత్యక్రియలు పూర్తయ్యాయి.

More Telugu News