: మహాత్ముడి నుంచి నిజాయతీని నేర్చుకుందాం... జగన్ ట్వీట్స్

మహాత్మా గాంధీ 146వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతిపితకు ఘనంగా నివాళి అర్పించారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన గాంధీజీతో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నివాళి అర్పించారు. అంతకుముందు గాంధీ జయంతిని పురస్కరించుకుని జగన్ ఓ సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఆలోచనలు, మాటలు, చేతల్లో నిజాయతీగా ఉండటాన్ని మనమంతా బాపూజీ నుంచి నేర్చుకుందాం’’ అని ఆ సందేశంలో జగన్ పిలుపునిచ్చారు.

More Telugu News