: సుష్మా ప్రసంగం భేష్... ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

ఐక్యరాజ్యసమితిలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతూనే పాకిస్థాన్ కు తగిన రీతిలో గుణపాఠం చెప్పారంటూ ఆయన సుష్మాను ఆకాశానికెత్తేశారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని ఐరాస వేదికగా సుష్మా విస్పష్ట ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాక్ ప్రధాని చెప్పిన నాలుగు సూత్రాలు అవసరం లేదని, ఉగ్రవాదాన్ని నిలిపివేసి చర్చలకు రావటమన్న ఒకే ఒక్క సూత్రం చాలునని సుష్మా తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిందించిన సుష్మా, పాక్ లో ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విరుచుపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడమే కాక, వారికి సాయం చేస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. సుష్మా ప్రసంగం విన్న వెంటనే ఆమెను అభినందిస్తూ మోదీ సందేశం పంపారు.

More Telugu News