: ఆ మృతదేహం 'అదితి'దే...కుప్పకూలిన తండ్రి శ్రీనివాస్!
విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహం అదితిదేని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. విగత జీవిగా పడి ఉన్న కుమార్తెను చూసిన తండ్రి శ్రీనివాస్ కుప్పకూలిపోయారు. చెవికమ్మలు, మెడలో గొలుసును చూసి ఆ మృతదేహం తమ కూతురుదేనని ఆయన గుర్తించారు. దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కుమార్తె మృతదేహం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దిబ్బపాలెంలో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. ఆ చిన్నారి మృతదేహానికి రేపు పోస్టుమార్టం నిర్వహిస్తారు.