: ప్రతిష్ఠంభన తొలగించేందుకు నడుం బిగించిన పాక్ క్రికెట్ దిగ్గజం
అంతర్జాతీయ క్రికెట్ లో వసీం అక్రమ్ అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. హ్యాండ్ సమ్ క్రికెటర్ గా పేరొందిన వసీం అక్రం, అంతకంటే అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్థాన్ క్రికెట్ ఖ్యాతిని పెంచాడు. భారత క్రికెటర్లకు మెళుకువలు నేర్పేందుకు సదా సిద్ధంగా ఉండే వసీం అక్రమ్ ఇప్పుడు మరో బాధ్యతను తీసుకుంటానంటున్నాడు. గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు నడుం బిగించాడు. పీసీబీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వేళ, అక్రమ్ చొరవ తీసుకుని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాడు.
ప్రపంచంలో భారత్ ను అత్యంత శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు పూనుకున్నారని, అదే సమయంలో ప్రపంచ క్రికెట్ లో భారత్ సూపర్ పవర్ గా నిరూపించుకుందని, వారి సేవలు ఇతర దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని అక్రమ్ కోరాడు. భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ప్రధాని కలుగజేసుకుని ప్రతిష్ఠంభన తొలంగించాలని, డిసెంబర్ లో ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా చూడాలని వసీం అక్రమ్ కోరాడు.