: నిర్లక్ష్యంగా వ్యవహరించి రివాల్వర్ పోగొట్టుకున్న ఎస్సై సస్పెన్షన్

నిర్లక్ష్యంగా వ్యవహరించి తన సర్వీసు రివాల్వర్ పోగొట్టుకున్న ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు పడింది. నల్లొండ జిల్లాకు చెందిన ఎస్ఐ శంకర్ రెడ్డి రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఒక ఆలయంలో తన రివాల్వర్ పోగొట్టుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ ను సస్పెండ్ చేస్తున్నట్లు జల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ప్రకటించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఎస్ఐ శంకర్ రెడ్డిపై ఈ వేటు పడిందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

More Telugu News