: తమిళ జాలర్లపై శ్రీలంక నిర్దయగా వ్యవహరిస్తోంది!: ప్రధాని మోదీకి జయలలిత లేఖ
సముద్రంలో చేపల వేటకు వెళ్తున్న తమిళ జాలర్లపై శ్రీలంక ప్రభుత్వం, నావికా దళం నిర్దయగా వ్యవహరిస్తోందని, చర్చల ద్వారా తమ జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత ఒక లేఖ రాశారు. జీవనోపాధి నిమిత్తం వేటకు వెళ్తున్న తమిళ జాలర్ల హక్కులను కాపాడాలని ఆమె కోరారు. జయలలిత రాసిన లేఖను మీడియాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, తమ సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ అక్కడి నావికాదళం వారిని అదుపులోకి తీసుకున్న సంఘటనలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే.