: తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా ముగ్గురి పేర్లకు యూపీఎస్సీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు త్వరలోనే పూర్తి స్థాయి డీజీపీ నియామకం జరగనుంది. ఈ మేరకు డీజీపీ నియామకానికి యూపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, తేజ్ దీప్ కౌర్, దుర్గాప్రసాద్, అరుణా బహుగుణల పేర్లను తెలంగాణ ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. వారిలో అనురాగ్ శర్మ, దుర్గాప్రసాద్, అరుణా బహుగుణల పేర్లను యూపీఎస్సీ ఓకే చేసింది. దీంతో వీరు ముగ్గురిలో ఒకరు పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే, ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న అనురాగ్ శర్మ వైపే టీఎస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని సమాచారం.

More Telugu News