: బంగారం బేల చూపులు... వరుసగా ఐదో రోజూ తగ్గిన ధర
బంగారం వ్యాపారం అనుకున్నంతగా సాగక పోవడంతో బంగారం బేల చూపులు చూస్తోంది. నూతన కొనుగోళ్ల కన్నా, అమ్మకాలు అధికంగా ఉండటంతో, వరుసగా ఐదవ సెషన్ లోనూ బంగారం ధర తగ్గింది. నగల వ్యాపారులు, ట్రేడర్ల నుంచి సంతృప్తికర డిమాండు రాకపోవడంతో క్రితం ముగింపుతో పోలిస్తే, రూ. 250 తగ్గి రూ. 26,150కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 150 పడిపోయి రూ. 34,600కు చేరింది. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2 శాతం తగ్గి 1,111.83 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రెండు వారాల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం. తదుపరి సెషన్లలో సైతం బంగారం ధరలు పతనం కావచ్చని అంచనా.