: కార్లో పిల్లలుండగా పొగతాగితే జరిమానా... యూకేలో కొత్త చట్టం!

యూకేలో పొగతాగడంపై కీలకమైన చట్టం అమలులోకి రానుంది. కారులో చిన్నపిల్లలున్నప్పుడు పొగతాగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. 18 ఏళ్లలోపు ఉన్నవారితో కలిసి కారులో ప్రయాణిస్తూ పొగతాగడాన్ని యూకే ప్రభుత్వం నిషేధించింది. ఇది రేపటి నుంచి అమలులోకి రానుంది. నిబంధన అతిక్రమిస్తే 50 పౌండ్ల నుంచి 25 వేల పౌండ్ల వరకు జరిమానా విధించనున్నారు. పొగతాగే వారి బారి నుంచి పిల్లలను రక్షించేందుకు ఈ నిబంధన తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు. పిల్లలు కారులో ఉండగా, ఇతరులు తాగే పొగ వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News