: రెండో పెళ్లి వార్తలను ఖండించిన హృతిక్ రోషన్ మాజీ భార్య

తాను మరోసారి పెళ్లి చేసుకోబోతున్నానంటూ వస్తున్న వార్తలను బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ తిరస్కరించింది. మీడియాలో తన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపింది. బాలీవుడ్ నటుడు, హృతిక్ స్నేహితుడైన అర్జున్ రాంపాల్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, తప్పుడు కథనాలు ప్రచురితమైతే అది పత్రిక బాధ్యతారాహిత్యమవుతుందని, ఇలాంటి పుకార్లు ఎంతో బాధ కలిగిస్తాయని సుసానే ఆవేదన వ్యక్తం చేసింది. తానిప్పుడు సింగిల్ వర్కింగ్ మదర్ గా, తన పద్ధతిలో తాను బ్రహ్మాండంగా జీవిస్తున్నానని చెప్పింది.

More Telugu News