: నితీష్ సభలో మోదీకి జేజేలు... ఇబ్బంది పడ్డ సీఏం!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, నవోడలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, స్థానికుల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. నితీష్ ప్రసంగిస్తుండగా, కొందరు మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు, నితీష్ కు వ్యతిరేకంగా నినదించారు. ఈ నేపథ్యంలో, సభావేదికపై ఉన్న నితీష్ కుమార్ చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన ప్రసంగాన్ని త్వరగా ముగించి, వెళ్లిపోయారు.

More Telugu News