: బీహార్ ఎన్నికల సిత్రాలు...క్లబ్ డాన్సర్ తో అభ్యర్థి చిందులు
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. జేడీయూ తరపున పోటీ చేస్తున్న అభయ్ కుశ్వాహా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామంలో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేయించారు. అందులో పాల్గొన్న ఆయన క్లబ్ డాన్సర్ తో చిందులేశారు. దీనినంతటినీ వీడియో తీసిన కొంత మంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో 'బీహార్ ఎన్నికల సిత్రాలు చూడవయా' అనే వ్యాఖ్యతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా? అంటూ అక్కడ పెద్ద చర్చే నడుస్తోంది.