: పెళ్లి జీవితకాలపు బంధం కాదు: సల్మాన్ ఖాన్
ప్రస్తుత తరంలో పెళ్లి అనేది జీవితకాల బంధం కాదని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'బిగ్ బాస్' సీజన్-9 ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంతకూ తాను శాశ్వతంగా పెళ్లి చేసుకోవాలా? లేక తాత్కాలికంగా చేసుకోవాలా? అని ఓ మీడియా ప్రతినిధిని అడిగాడు. దానికి సమాధానంగా, అసలు మీరు పెళ్లే చేసుకోకండని అతను సమాధానమివ్వడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అనంతరం సల్మాన్ మాట్లాడుతూ, కొందరు తనను పెళ్లి చేసుకోమంటారని... మరికొందరు వద్దని చెబుతారని... ఇంతకూ తాను ఏమి చేయాలని అన్నాడు. 'మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తున్నారా? లేక నిరుత్సాహపరుస్తున్నారా?' అని ప్రశ్నించాడు.