: లోకేష్ కు చంద్రబాబు ఇచ్చిన పదవులివే!

తన కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కు పార్టీ కేంద్ర కమిటీలో కీలక పదవిని చంద్రబాబునాయుడు అప్పగించారు. లోకేష్ రెండు రాష్ట్రాల్లో పర్యటనలు జరిపి కార్యకర్తలతో మమేకం కావాల్సి వున్నందున ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చామని తెలిపారు. ఇదే సమయంలో మొత్తం 17 మందితో పార్టీ పొలిట్ బ్యూరోను ప్రకటించిన చంద్రబాబు, ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా కూడా లోకేష్ ను నామినేట్ చేశారు. పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, యనమల, అశోక్ గజపతిరాజు, చినరాజప్ప, కేఈ, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి, రమేష్ రాథోడ్, ఉమామాధవ రెడ్డి, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావులను నియమించిన ఆయన ఎక్స్ అఫిషియోలుగా లోకేష్ తో పాటు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్.రమణలను నియమించారు.

More Telugu News