: దమ్ముంటే కొండారెడ్డి బురుజు సెంటర్లో చర్చకు రాగలరా?: బైరెడ్డి సవాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అన్నదాతల వాసనే గిట్టదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పుకుంటున్న చంద్రబాబు కానీ, కేబినెట్ మంత్రులు కానీ దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని అడిగారు. వారిలో ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్ కు రావాలని ఆయన సవాలు విసిరారు. రైతులను పట్టించుకోని బాబు, రైతు యాత్ర అంటూ ఏసీ బస్సులో తిరగడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ను సిద్ధేశ్వరం దగ్గర కట్టి ఉంటే రాయలసీమ సస్యశ్యామలంగా మారి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. హంద్రీనీవా కాంట్రాక్టర్లంతా బాబు చుట్టూ ఉన్నారని ఆయన తెలిపారు. ఓర్వకల్లు మండలంలో రైతులకు తెలియకుండా రిలయన్స్ కు 5,500 ఎకరాలు కట్టబెట్టారని, దీని వ్యతిరేకిస్తూ వచ్చేనెల 14, 15, 16 తేదీల్లో 'రైతుల బతుకుతెరువు' యాత్ర చేపడతానని ఆయన తెలిపారు.

More Telugu News