: మేము అలాంటి వాళ్లం కాదు... రాబర్ట్ ముగాబే ఉద్వేగ భరిత ప్రసంగం
తమను తక్కువగా చూసే వారిపై జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ దేశాల తీరుతెన్నులపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశంలో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశస్థులను స్వలింగ సంపర్కులుగా భావించే ఇతర దేశాల వారిని ఆయన తీవ్రంగా విమర్శించారు. 'వి ఆర్ నాట్ గేస్' (మేం స్వలింగ సంపర్కులం కాదు) అంటూ మరోసారి స్పష్టం చేశారు. 2013లో ఓ సందర్భంలో స్వలింగ సంపర్కం చేసే వారు కుక్కలు, పందులు, మేకలు కంటే హీనమని ఆయన తూలనాడిన సంగతి పెద్ద దుమారాన్ని రేపింది.