: 200 మంది పశ్చిమ గోదావరి టీచర్లపై సైబర్ క్రైం కేసు
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 200 మంది టీచర్లపై సైబర్ క్రైం కేసు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదనరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీచర్ల బదిలీలకు సంబంధించి, ఇతరుల అకౌంట్లలోకి లాగిన్ అయ్యి తప్పుడు వివరాలు, ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. బదిలీలపై ఇప్పటి వరకు 800 అభ్యంతరాలు అందాయని, వాటిలో అర్హత గలిగిన 500 అభ్యంతరాలను పరిష్కరించేందుకు స్వీకరించామని ఆయన తెలిపారు. విచారణ అనంతరం తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉపాధ్యాయులను గుర్తించామని ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా బదిలీలకు 4,573 దరఖాస్తులు అందాయని ఆయన తెలిపారు.