: కార్డుల వాడకాన్ని ప్రోత్సహిస్తాం: ఆర్బీఐ

నగదు రహిత చెల్లింపులపై ప్రచారం చేపడతామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ప్రకటించిన తరువాత కార్డుల వాడకంపై ఓ ప్రకటన విడుదల చేసింది. కార్డుల వాడకాన్ని ప్రోత్సహించి, నగదు రహిత సమాజం కోసం కృషి చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. దీని కోసం ఓ కాన్సెప్ట్ పేపర్ ను రూపొందిస్తామని, ఇది అమలు చేసేందుకు చిన్న నగరాలపై దృష్టి పెడతామని ఆర్బీఐ పేర్కొంది. అలాగే 100, 500, 1000 రూపాయల నోట్ల నెంబర్ పేటర్న్ మార్చి, కొత్త నోట్లను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లలో ఎడమ నుంచి కుడికి సంఖ్యల పరిమాణం పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. భవిష్యత్ లో చెల్లింపుల్లో పారదర్శకత కోసం కార్డుల వినియోగం ప్రోత్సహిస్తామని ప్రకటించింది.

More Telugu News