: రేపే టీడీపీ జాతీయ, ఏపీ, తెలంగాణలకు కొత్త కమిటీలు... ఎవరెవరికి పదవులు దక్కే అవకాశం?

రెండు రాష్ట్రాల టీడీపీ నూతన సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సర్వం సిద్ధమయింది. రేపు ఉదయం ఈ కమిటీలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించనున్నారు. ఇరు రాష్ట్రాల కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు పగ్గాలు చేపడతారని సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, కొనకళ్ల నారాయణ, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావులకు అవకాశం లభించవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్, సీఎం రమేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడులను నియమించవచ్చు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి నియమితులవుతారని సమాచారం. ప్రధాన కార్యదర్శులుగా కేపీ వివేకానంద, సండ్ర వెంకటవీరయ్య, మల్లయ్య యాదవ్, సీతక్కలకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఏపీ విభాగం అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శులుగా బొండా ఉమా, జయనాగేశ్వర్ రెడ్డి, వర్ల రామయ్యలను నియమించవచ్చని సమాచారం. మొత్తానికి ఏపీలో 65 మందితో, తెలంగాణలో 75 మందితో కమిటీలను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

More Telugu News