: మోదీ పర్యటనపై కేజ్రీవాల్ సూటి విమర్శలు

భారత్ లో పెట్టుబడులు పెట్టండి... అంటూ దేశ ప్రధాని ఒక్కో కంపెనీకి వెళ్లడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల వల్ల దేశం ఏం సాధించిందని ఆయన సూటిగా అడిగారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై ఆయన ట్విట్టర్ సాక్షిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మేక్ ఇన్ ఇండియా' కంటే ముందు 'మేక్ ఇండియా' చేయాలని సూచించారు. దేశంలో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు పెంచాలని ఆయన కోరారు. చైనా ముందు స్వదేశాన్ని తీర్చిదిద్ది అప్పుడు విదేశీ పెట్టుబడుల కోసం ఆసక్తి చూపిందని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తితే వారి విధానాలు మనమీద రుద్దే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముందు దేశాన్ని చక్కదిద్దితే, ఆ తరువాత విదేశీ పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News