: రేపటి అసెంబ్లీ ముట్టడి యథాతథం... విరసం నేత వరవరరావు ప్రకటన
వరంగల్ జిల్లా మొద్దుగుట్ట అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా 400 ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రేపు జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో ఎలాంటి మార్పు లేదని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ముట్టడి యథాతథంగా జరుగుతుందని కొద్దిసేపటి క్రితం ఆయన ప్రకటించారు. 400 ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్ కౌంటర్లు లేని రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్, ప్రస్తుతం బూటకపు ఎన్ కౌంటర్లకు తెరతీశారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జరిగే ఎలాంటి ఘటనలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.