: కృష్ణా జిల్లాలో నిలిచిన కోట్లాది రూపాయల రిజిస్ట్రేషన్లు... కారణమేంటంటే...!

ఏపీలోని కృష్ణా జిల్లాలో నేటి ఉదయం కలకలం రేగింది. కోట్లాది రూపాయలు చేతులు మారడమే కాక పెద్ద మొత్తంలో సర్కారీ ఖజానాకు ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్లు జిల్లావ్యాప్తంగా నిలిచిపోయాయి. కారణం ఏంటంటే... విద్యుత్ సరఫరా లేకపోవడమేనట! అయినా ఏపీలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో కోతలేమిటనేగా మీ అనుమానం? సర్కారీ కార్యాలయం అయినా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేగా. మరి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. దీంతో ట్రాన్స్ కో అధికారులు సదరు కార్యాలయాలకు నేటి ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ కార్యాలయాల్లో చీకటి రాజ్యమేలుతోంది. ఫలితంగా వేలాది రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కోట్లాది రూపాయల భూ బదలాయింపులు వాయిదా పడ్డాయి.

More Telugu News