: స్కై డైవింగ్ చేస్తూ చెట్టుకు తగిలి మరణించిన 'ఎరిక్ రోనర్'
ప్రఖ్యాత స్కీ బేస్ జంపర్ ఎరిక్ రోనర్(39) స్కై డైవ్ చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర కాలిఫోర్నియాలోని స్క్వా వ్యాలీలో నిర్వహిస్తున్న ఓ గోల్ఫ్ ఈవెంట్ ప్రారంభానికి ముందు స్కై డైవింగ్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎరిక్ డైవ్ చేస్తుండగా చెట్టుపై పడటంతో చనిపోయాడని షెరిఫ్ రాష్ట్ర కోప్టెన్ డెన్నిస్ వాష్ తెలిపారు. గోల్ఫ్ టోర్నమెంట్ జరగడానికి ముందు స్కై డైవింగ్ నిర్వహించడం అక్కడ అనవాయతీ. ఇందులో భాగంగా నిర్వహించిన స్కై డైవ్ లో అందరూ సురక్షితంగా కిందకి దిగగా రోనర్ మాత్రం చెట్టుకు బలంగా ఢీకొనడంతో అక్కడే చిక్కుకుపోయి మృత్యువాత పడ్డాడు.