: టెక్నాలజీ తోడుగా బిలియనీర్లయిన ఇండియన్స్!
ప్రపంచాన్ని నవశకంలోకి నడిపించిన సాంకేతికత ఎందరి జీవితాల్లోనో మార్పులు తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మారుతున్న సాంకేతికతను ముందుగానే అందిపుచ్చుకున్న ఎందరో భారతీయులు బిలియనీర్స్ గా మారారు. ఇటీవలి ఫోర్బ్స్ అత్యధిక ధనవంతుల జాబితాలో ఎక్కువ మంది టెక్ నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఇండియాలో సాంకేతిక సంస్థలు స్థాపించి బిలియనీర్లుగా మారిన టాప్ -10 ప్రముఖుల వివరాలివి.
1. అజీం ప్రేమ్ జీ, చైర్మన్, విప్రో
ఆస్తి విలువ 15.9 బిలియన్ డాలర్లు, వ్యాపారం - సాఫ్ట్ వేర్ సేవలు.
2. శివ్ నాడార్, వ్యవస్థాపక చైర్మన్, హెచ్ సీఎల్
ఆస్తి విలువ 12.9 బిలియన్ డాలర్లు, వ్యాపారం - సాఫ్ట్ వేర్ సేవలు.
3. సునీల్ మిట్టల్, వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ, భారతీ ఎంటర్ ప్రైజస్
ఆస్తి విలువ 6.2 బిలియన్ డాలర్లు, వ్యాపారం - టెలికం సేవలు
4. ఎన్ఆర్ నారాయణమూర్తి, సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్
ఆస్తి విలువ 1.9 బిలియన్ డాలర్లు, వ్యాపారం - సాఫ్ట్ వేర్ సేవలు
5. వేణుగోపాల్ ధూత్, సీఎండీ, వీడియోకాన్
ఆస్తి విలువ 1.8 బిలియన్ డాలర్లు, వ్యాపారం - ఎలక్ట్రానిక్స్, డీటీహెచ్, టెలికం
6. ఎస్ గోపాలకృష్ణన్, సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఇన్ఫోసిస్
ఆస్తి విలువ 1.7 బిలియన్ డాలర్లు, వ్యాపారం - సాఫ్ట్ వేర్ సేవలు
7. నందన్ నిలేకని, సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్
ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లు, వ్యాపారం - సాఫ్ట్ వేర్ సేవలు
8. బిన్నీ బన్సాల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఫ్లిప్ కార్ట్
ఆస్తి విలువ 1.3 బిలియన్ డాలర్లు, వ్యాపారం - ఈ-కామర్స్
9. సచిన్ బన్సాల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫ్లిప్ కార్ట్
ఆస్తి విలువ 1.3 బిలియన్ డాలర్లు, వ్యాపారం - ఈ-కామర్స్
10. కే దినేష్, సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్
ఆస్తి విలువ 1.2 బిలియన్ డాలర్లు, వ్యాపారం - సాఫ్ట్ వేర్ సేవలు