: ముగిసిన మోదీ అమెరికా పర్యటన... న్యూయార్క్ లో ఢిల్లీ విమానమెక్కిన ప్రధాని

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం అమెరికా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం తన పర్యటనను ముగించుకున్నారు. ఐరాస సమావేశాల కోసమే వెళ్లినప్పటికీ అక్కడి ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీల అధిపతులతోనూ మోదీ వరుస భేటీలు నిర్వహించారు. భారత్ లో పెట్టుబడులకు ఆయా కంపెనీలను ఒప్పించగలిగారు. ఇక ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతును ఆయన కూడగట్టగలిగారు. పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్న నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.

More Telugu News