: ముగ్గురు ప్రధానులను ఆహ్వానించాం: ఏపీ మంత్రి నారాయణ

అమరావతి శంకుస్థాపనకు ముగ్గురు ప్రధానులను ఆహ్వానించామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబె, సింగపూర్ ప్రధాని లీ హొసైన్ లూంగ్ లను ముఖ్యఅతిధులుగా ఆహ్వానించామని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆ రోజు ప్రత్యేకమైన పండగ అని నారాయణ అభిప్రాయపడ్డారు.

More Telugu News