: స్మార్ట్ సిటీలను గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దుతాం: ఐజీబీజీ కౌన్సిల్ చైర్మన్
దేశంలోని వంద స్మార్ట్ సిటీలనూ గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దుతామని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీజీ) చైర్మన్ ప్రేమ్ సీ జైన్ వెల్లడించారు. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీలను గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, పీఎంఓ సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్మార్ట్ సిటీలను ప్రకటించినప్పుడు తాము ఆయనకు ఒక లేఖ రాశామన్నారు. ఆ వంద స్మార్ట్ సిటీలను గ్రీన్ సిటీలుగా మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశామన్నారు. అందుకు అనుమతి లభించిందని ఆయన చెప్పారు. వంద స్మార్ట్ సిటీలలో వర్షపు నీటి వినియోగం, చెత్త నిర్వహణ, రీసైక్లింగ్, మొదలైన వాటిని అమలు చేసి గ్రీన్ సిటీలుగా మారుస్తామని జైన్ వివరించారు.