: టీడీపీ దిగజారుడు రాజకీయాలు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మండిపాటు
తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకుర్తి ఘటనకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుదే బాధ్యత అని, ఒక పథకం ప్రకారమే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి తమ కార్యకర్తలపై రాళ్లు రువ్వేలా చేశారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. నిన్న పాలకుర్తి మార్కెట్ యార్డులో టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.