: చైనాలో దూసుకెళ్లిన భారత రోయర్లు!
బీజింగ్ లో జరుగుతున్న 16వ ఆసియన్ రోయింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఈ పోటీల్లో మనవారు ఏడు పతకాలు సాధించారు. వీటిల్లో ఐదు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. కపిల్ శర్మ, జస్వీందర్ సింగ్, రాజేష్ వర్మ, మహమ్మద్ ఆజాద్ ల బృందం 'మెన్స్ ఫోర్స్' విభాగంలో గం. 6:03:25 సెకన్ల సమయంలో, దత్తూ బబన్ 'సింగిల్ స్కుల్స్' విభాగంలో గం.7:18:41 సెకన్లలో రేసు పూర్తి చేసి సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. మెన్స్ డబుల్ స్కుల్స్ విభాగంలో రూపేంద్ర సింగ్ం సోనూ లక్ష్మీ నారాయణ్, లైట్ వెయిట్ విభాగంలో విక్రమ్ సింగ్, సుకేందర్ తోమర్ ల జంటలు పతకాలు గెలుచుకున్నాయి. ఎనిమిది మంది పురుషుల జట్టు 'మెన్స్ ఎయిట్ ఈవెంట్'లో రజత పతకం సాధించగా, దేవేంద్ర సింగ్, నవీన్ కుమార్ ల జోడి, దుష్యంత్ లు తాము పాల్గొన్న ఈవెంట్లలో కాంస్య పతకాలు పొందారు.