: రాజధాని కాదు, రాబందుల రాజ్య నిర్మాణం: వాసిరెడ్డి పద్మ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణం అని చెప్పుకుంటూ... రాబందుల రాజ్యాన్ని నిర్మిస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి లాక్కున్న వేలాది ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడం వెనకున్న అంతరార్థం ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అసలు, ఏపీలో కడుతున్న రాజధాని స్వదేశీనా? లేక విదేశీనా? అనే విషయం స్పష్టం చేయాలని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ చంద్రబాబు స్పందించడం లేదని... ఆయనొక మనసు లేని ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.

More Telugu News