: విశాఖ రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

విశాఖ జిల్లాలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి సాయినాథ్ కెమికల్స్ లో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారని తెలిసింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News