: హద్దులు మీరితే పక్కన పెడతా: ఇలియానా

‘అందరితో కలిసిపోవడమంటే నాకు ఇష్టం" అంటోంది గోవా బ్యూటీ ఇలియానా. అయితే, దీని వల్ల ప్లస్, మైనస్ రెండూ ఉన్నాయంటోంది. "ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరితో కలిసిపోయి మాట్లాడతాను. అది ప్లస్. ఇక మైనస్ విషయానికొస్తే .. ఫ్రీగా మాట్లాడుతున్నాను కదా అని కొంతమంది రెచ్చిపోతారు. అట్లాంటి సందర్భాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. వారిని హద్దుల్లో పెట్టాలి.. దూరంగా పెట్టేయాలి. వారి పరిధి దాటి ప్రవర్తిస్తే ..అంతు చూడటానికి కూడా వెనుకాడకూడదు. మనుషుల సైకాలజీని నేను సులువుగానే గ్రహించగలుగుతాను. నాతో ఎవరైనా పిచ్చిగా ప్రవర్తించాలని వారు అనుకుంటున్నప్పుడు వాళ్ల బాడీ లాంగ్వేజ్ ను పసిగడతా. తెలివిగా వాళ్లను పక్కన పెట్టేస్తా" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సెట్లో కోస్టార్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండే ఇలియానా ఈ విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

More Telugu News