: కల్తీ కల్లు మరణాల వెనుక టీఆర్ఎస్ కుట్ర: టీడీపీ
చౌక మద్యంపై తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గిన తరువాతనే కల్తీకల్లు మరణాలు తెరపైకి వచ్చాయని, ఈ మరణాల వెనుక ప్రభుత్వం కుట్ర దాగుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వివేక్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం గౌడ కులస్తులపై కక్ష సాధిస్తోందని ఆరోపించిన ఆయన, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికీ పెంచిన పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. చీమూ నెత్తురూ ఉంటే తన రాజీనామాను ఆమోదించుకుని ఎన్నికల్లో గెలిచి చూపాలని తలసానిని సవాల్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తలసాని మాట్లాడాలని చూస్తే, బహిష్కరిస్తామని వివరించారు.