: ఆ పని చేస్తే నష్టపోయేది మీరే!: పాక్ ను హెచ్చరించిన భారత్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరిగే క్రికెట్ పోటీలలో ఇండియాను బహిష్కరిస్తే, నష్టపోయేది పాకిస్థాన్ మాత్రమేనని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా హెచ్చరించాడు. "డిసెంబరులో మాతో ఆడాల్సిన సిరీస్ నుంచి భారత్ తప్పుకుంటే, ఐసీసీ టోర్నీల్లో ఇండియాతో మేము ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ లనూ బహిష్కరిస్తాం" అని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఛైర్మన్ షహర్యార్ ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో శుక్లా ఘాటుగా స్పందించాడు. షహర్యార్ తన వ్యాఖ్యలతో బీసీసీఐని బెదిరిస్తున్నాడా? లేదా ఐసీసీని బెదిరిస్తున్నాడా? అని ఆయన ప్రశ్నించాడు. ఐసీసీ నిబంధనలకు పాకిస్థాన్ కట్టుబడి ఉండాల్సిందేనని, లేకుంటే, జరిమానాకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. భద్రత కారణాల వల్లే పాకిస్థాన్ లో ఏ జట్టూ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడటం లేదని ఆయన అన్నాడు.

More Telugu News