: ఒడిశాలో స్వల్ప భూకంపం
ఒడిశా రాష్ట్రంలోని దేన్ కనాల్ జిల్లాలో 2 నుంచి 3 సెకన్ల పాటు ఈరోజు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.2గా నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. స్వల్ప భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగు తీశారు. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా, పలు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలాచోట్ల భూమి కంపించింది.