: న్యాయవ్యవస్థపై ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత న్యాయవ్యవస్థపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ సంస్కరణలపై జరిగిన సమావేశం సందర్భంగా హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, సామాన్యులకు న్యాయం అందనంత దూరంలో ఉందని అన్నారు. న్యాయవ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని అభిలషించారు. మన దేశంలో ఇంకా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థే అమలవుతోందని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతి వేళ్లూనుకుపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.