: ఇక ‘లాలీపాప్’ ఉద్యమం... రేపటి నుంచేనన్న యువ సంచలనం హార్దిక్

గుజరాత్ పటేళ్ల కోసం పోరు బాట పట్టిన యువ సంచలనం హార్దిక్ పటేల్ రేపటి నుంచి కొత్త తరహా ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ‘లాలీపాప్ ఉద్యమం’ పేరిట చేపట్టనున్న ఈ తరహా ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన నిన్న ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన విద్యార్థులకు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ఫీజు మాఫీ పథకానికి నిరసనగానే ఈ కొత్త ఉద్యమాన్ని చేపడుతున్నట్లు హార్దిక్ ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించనున్న తన సంస్థ ‘పటీదార్ అనామత్ ఆందోళన సమితి’ కార్యకర్తలు పటేల్ సామాజిక వర్గాలకు చెందిన వారికి ‘లాలీపాప్’ లను పంచుతారని ఆయన పేర్కొన్నారు.

More Telugu News