: భారత్ పై పోరాటానికి 3500 కోట్లు సమీకరిస్తున్న హఫీజ్ సయీద్
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ భారత్ పై దాడులకు భారీ ప్రణాళిక రచిస్తున్నాడు. ఇందులో భాగంగా సేవ పేరుతో బక్రీద్ రోజున 3500 కోట్లు సేకరిస్తున్నాడు. పవిత్రమైన బక్రీద్ రోజున ముస్లింలు కుర్బాన్ సమర్పించడం ఆనవాయతీ. ఉన్నదాంట్లో పదో వంతును పేదలకు ఇవ్వడం ముస్లింల సంప్రదాయం. దీనిని అనుకూలంగా మార్చుకున్న హఫీజ్ సయీద్ 3500 కోట్ల రూపాయలు పోగేసేందుకు తెరతీశాడు. ఈ మొత్తాన్ని భారత్ పై యుద్ధానికి వినియోగించనున్నాడు. ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు కొనుగోలు చేయడంతో బాటు, కాశ్మీర్ లోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు భారీ మొత్తం ఆశచూపి వశపరుచుకునేందుకు వినియోగించనున్నాడు. బక్రీద్ ను పురస్కరించుకుని భారత్ పై యుద్ధం చేస్తున్న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కూడా భారీ స్థాయిలో నిధులు సేకరించింది.