: లండన్ లోని అంబేద్కర్ భవనాన్ని సొంతం చేసుకున్న మహారాష్ట్ర
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ లో నివసించిన గృహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. లండన్ లోని భారత హైకమిషన్ ద్వారా 3.1 మిలియన్ పౌండ్లు చెల్లించి ఆ ఇంటిని సొంతం చేసుకుంది. గతంలో ఆ భవనాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు పలువురు ముందుకు వచ్చారు. అయితే పలు దళిత సంఘాల ఒత్తిడితో దానిని మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1920లో అంబేద్కర్ లండన్ లో చదువుకునేటప్పుడు కింగ్ హెన్రీ రోడ్ లోని ఓ భవనంలో నివసించేవారు. అయితే ఆయన సంస్మరణార్థం ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. దీంతో 2,050 చదరపు అడుగుల్లో మూడంతస్తులు గల ఈ భవనాన్ని కొనుగోలు చేసింది. దీనిని అంబేద్కర్ జ్ఞాపకార్థం మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు.