: రాయలసీమ దాహార్తిని తీర్చేవి హంద్రీనీవా, నగరి, గాలేరు మాత్రమే: పురందేశ్వరి
రాయలసీమ దాహార్తిని తీర్చేవి హంద్రీనీవా, నగరి, గాలేరు ప్రాజెక్టులు మాత్రమేనని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. పట్టిసీమ ద్వారా సీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం సందేహమేనని అభిప్రాయపడ్డారు. పట్టిసీమకు పెట్టిన ఖర్చు పోలవరానికి ఖర్చు చేస్తే సీమకు నీరు వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో నేడు పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబు పోలవరాన్ని అంకితభావంతో త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇక సీమలో రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆలోచించకుండా ప్రత్యేక ప్యాకేజీతో ఏపీని అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.