: కావాలంటే ఓ పార్టీ పెట్టుకోండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు టీఆర్ఎస్ ఎంపీ సూచన
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. పత్రిక, టీవీ ఛానల్ ను అడ్డుపెట్టుకొని ఎంతసేపూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణను బద్నాం చేయడమే ఆయన పని అని ఆరోపించారు. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా తప్పుడు రాతలు రాస్తూ తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. నూతన తెలంగాణను ఓ విఫల ప్రయోగంగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు మానేయాలని... కావాలంటే ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవాలని రాధాకృష్ణకు సూచించారు. ఈరోజు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.