: రెడ్ శాండల్ స్మగ్లర్లకు పోలీసుల సహకారం: ఏపీ డీజీపీ రాముడు సంచలన వ్యాఖ్యలు

శేషాచలం అడవుల నుంచి ఎర్ర చందనం విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతూ ఉండటం వెనుక కొందరు పోలీసుల సహకారం కూడా ఉందని ఏపీ డీజీపీ జే వెంకటరాముడు వ్యాఖ్యానించారు. చందనం స్మగ్లర్ల వెనుక పోలీసుల పాత్ర ఉందన్నది బహిరంగ సత్యమే అయినా, దీన్ని డీజీపీ స్థాయి వ్యక్తి అంగీకరించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేడు కర్నూలు పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెడ్ శాండల్ స్మగ్లర్లతో చేతులు కలిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాలో బ్రౌన్ షుగర్ పట్టుబడటంపై విచారణ జరుపుతున్నామని రాముడు వివరించారు.

More Telugu News