: మీడియాలో కనపడాలని కమ్యూనిస్టులు తహతహలాడుతున్నారు: వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యమే లేదని, అలాంటి ఏ హోదా లేనివారు ప్రత్యేకహోదా అడుగుతున్నారని, ఇదంతా మీడియాలో కనపడటం కోసమేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కమ్యూనిస్టులకు మనుగడలేదన్నారు. సంయమనం ద్వారా ఆదరణ పెంచుకోవాలే తప్ప సంఘర్షణతో కాదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, ఆ పార్టీ ఓడిపోవడానికి కారణం రైతులన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు సాధిస్తుందన్న ధీమాను వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు.

More Telugu News