: క్యాబ్ లో ‘చోటా’ దాల్మియాకు చోటు... సంయుక్త కార్యదర్శిగా నియామకం
దివంగత బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా హఠాన్మరణంతో ఇటు బీసీసీఐనే కాక అటు కోల్ కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్ష పదవి కూడా ఖాళీ అయ్యింది. అయితే నిన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని క్యాబ్ అధ్యక్షుడిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నియమించారు. అదే సమయంలో జగ్ మోహన్ దాల్మియా సేవలకు గుర్తింపుగా ఆయన కుమారుడు అభిషేక్ దాల్మియాకు కూడా క్యాబ్ లో పదవి కట్టబెట్టారు. క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా అభిషేక్ దాల్మియా నిన్న గంగూలీతో పాటు పదవీ బాధ్యతలు చేపట్టారు.