: భర్త ఇచ్చిన కారు నచ్చలేదని పచ్చడి చేసేసింది!


ఎవరైనా బహుమతి ఇస్తే జాగ్రత్తగా దాచుకుంటాం. అందులోనూ భర్త గిఫ్ట్ ఇస్తే ఇంకా పదిలంగా దాచుకుంటారు...కానీ తన భర్త బహుమతిగా ఇచ్చిన 'ఆడి ఏ7' కారు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు సరిపోవడం లేదని ఆగ్రహించిన ఓ మహిళ పెద్ద బండరాయి తీసుకుని ఆ కారును తుక్కుతుక్కుగా కొట్టేసింది. కొత్త కారును పూనకం వచ్చిన దానిలా పచ్చడిపచ్చడి చేస్తున్న మహిళను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడో ఔత్సాహికుడు. ఇది సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. ఆమెపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News