: మక్కా మృతుల్లో హైదరాబాదీ మహిళ

ఈ ఉదయం మక్కాలో జరిగిన తీవ్ర తొక్కిసలాటలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారెవరూ మరణించలేదని వెల్లడించిన అధికారులు, కొద్ది సేపటి క్రితం హైదరాబాద్, ఎల్ బి నగర్ పరిధిలోని మన్సూరాబాద్ నుంచి మక్కాకు వెళ్లిన ఓ మహిళ మృతి చెందినట్టు తాజాగా తెలిపారు. ఈ నెల 2న తన కుటుంబ సభ్యులతో కలసి మక్కాకు వెళ్లిన షేక్ బీబీజా, నేటి ఘటనలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసిందని ఓ హజ్ అధికారి చెప్పారు. కాగా, తమ శిబిరంలో 400 మంది ఏపీ యాత్రికులు ఉన్నారని వెల్లడించిన ఏపీ హజ్ కమిటీ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్, అందరూ క్షేమంగానే ఉన్నట్టు వివరించారు. బయటకు వెళ్లిన కొంతమంది యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News