: కాకినాడలో నకిలీ మావోయిస్టులు...అరదండాలేసిన పోలీసులు, రూ.13 లక్షలు స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నకిలీ మావోయిస్టుల కలకలం రేగింది. ముగ్గురు వ్యక్తులు మావోయిస్టులమని చెప్పుకుంటూ తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అంతేకాక పెద్ద ఎత్తున వసూళ్లకు తెర తీశారు. ఇప్పటికే ఆ వ్యక్తులు పలువురు ప్రముఖుల నుంచి భారీ ఎత్తున వసూళ్లు రాబట్టారట. వీరి బెదిరింపులపై సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితం కాకినాడలో సదరు నకిలీ మావోలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.